National
Education Policy-2020 Highlights
నూతన
విద్యావిధానం–2020 (ఎన్‌ఈపీ–2020)
5+3+3+4 విధానం అంటే ఏమిటి..?
నూతన విద్యా
విధానం(5+3+3+4) అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. మొదటి 5 ఏళ్లను ఫౌండేషన్
కోర్సుగా పరిగణించనుంది. 5 ఏళ్ల కోర్సులో తొలి 3 ఏళ్లు 3-6 ఏళ్ల వారికి ప్రీ
ప్రైమరీ,
గ్రేడ్ 1, 2 శిక్షణ, తర్వాతి
2 ఏళ్లు 6-8ఏళ్ల వారికి 1, 2 తరగతుల విద్య అందిస్తారు. ఆ
తర్వాతి 3ఏళ్లు.. అంటే 8-11 ఏళ్ల వారికి 3-5 తరగతులు, మరో 3
ఏళ్లు 11-14 ఏళ్ల వారికి 6-8 తరగతులు, 4 ఏళ్లు 14-18 ఏళ్ల
వారికి 9-12 తరగతులు నిర్వహిస్తారు.
నూతన విద్యావిధానం (NEP)–2020 ముఖ్యాంశాలు..
నూతన విద్యావిధానం (NEP)–2020 ముఖ్యాంశాలు..
> నూతన విద్యా విధానంలో భాగంగా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల వరకు విద్య తప్పనిసరి.
> 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన. ఏ విద్యార్ధిపైనా ఏ భాషనూ బలవంతంగా
రుద్దరు.
> ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్ అమలు చేయనున్నారు. కొత్త
విధానంలో ఇంటర్ విద్యను రద్దు చేసి.. డిగ్రీ విద్యను నాలుగేళ్లుగా మార్పు చేశారు.
> ఆరో తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్, ప్రోగామింగ్
కరికులమ్ ప్రవేశపెట్టనున్నారు.
> ఆరో తరగతి నుంచే వొకేషన్ కోర్సులను తీసుకురానున్నారు. విద్యార్థులపై
పాఠ్యాంశాల భారం తగ్గించి కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం చేయనున్నారు.
> హిందీని తప్పనిసరి కాదు.
>ప్రతి
సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించరు. 3, 5, 8 తరగతుల వారికి
పరీక్షలు ఉంటాయి.
> 10, 12వ తరగతుల విద్యార్థులకు ఎప్పటిలానే బోర్డు పరీక్షలు నిర్వహించినప్పటికీ..
పరీక్షల విధానంలో పూర్తిగా మార్పులు చేస్తారు.
> సిలబస్
భారాన్ని తగ్గిస్తారు. ఒకరకమైన సబ్జెక్టు, భాషపై కాకుండా వివిధ
అంశాలు, భాషల్లో పట్టు సాధించేలా కొత్త విద్యా విధానాంలో
మార్పులు చేశారు.
> ఐఐటీ వంటి
ఉన్నత విద్యా సంస్ధల్లోనూ మార్పులు. ఐఐటీ వంటి
సంస్థల్లోనూ ఆర్ట్స్, మానవ విజ్ఞాన శాస్త్రాలులను
చేర్చుతారు. సైన్స్ చదివే విద్యార్థులు ఆర్ట్స్ చదువుకోవచ్చు. ఆర్ట్స్ చదివే
విద్యార్థులు సైన్స్ చదువుకోవచ్చు.
> డిప్లొమా
కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్వవధి ఏడాదిగా
నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు
చేయనున్నారు.
> ఉన్నత
విద్యను నియంత్రించడానికి 'హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా'
(HECI) ఏర్పాటు చేస్తారు.
>2030 నాటికి అందరికీ, విద్య అందించడమే లక్ష్యం
> MPhil కోర్సును తొలగించిన కేంద్రం
> డిగ్రీ విద్య మూడు లేదా నాలుగేళ్లు, PG విద్య ఏడాది
లేదా రెండేళ్లు
> ఇంటర్ విద్య ఉండదు, ఇంటిగ్రేటెడ్ PG, UG ఐదేళ్లు
> మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ నిర్ణయం.
>నైపుణ్యం, అవగాహన, వికాసమే
ముఖ్యం, బట్టీకి స్వస్తి.. మార్కులకు తగ్గే ప్రాధాన్యం
>మూడేళ్లు రాగానే పిల్లలకు ‘ప్రీస్కూల్’
>డిగ్రీ మధ్యలో మానేసినా సర్టిఫికెట్
>వినూత్నమైన సబ్జెక్టులతో కాంబినేషన్
>దేశంలో అగ్రశ్రేణి విదేశీ సంస్థల క్యాంపస్‌లు
>ఉన్నత విద్యకు దేశమంతా ఒకే ప్రవేశ పరీక్ష
>కాలేజీలన్నీ 15 ఏళ్లలో ‘అటానమస్’
కావాలి
>లా, వైద్య
విద్య మినహా అన్నింటికీ ఒకే రెగ్యులేటరీ వ్యవస్థ
> విద్యార్థులపై కరికులమ్ భారం తగ్గించాలనేది మరియు 2030 నాటికి అందరీకి
విద్య అందించాలనేది లక్ష్య0.
0 Komentar