ప్రభుత్వ బ్యాంకులలో సగానికిపైగా ప్రైవేటీకరించే ఆలోచనలో కేంద్రం
ప్రస్తుతం
దేశంలోని డజను ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్‌సబీ)ల సంఖ్యను భవిష్యత్‌లో 4 లేదా 5కు
తగ్గించనున్నట్లు తెలుస్తున్నది. తొలుత అర డజను బ్యాంకులను ప్రైవేటీకరించే అవకాశం
ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (సీబీఐ), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ),
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), యూకో
బ్యాంక్‌ను వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు విక్రయించనున్నట్లు తెలుస్తున్నది. వ్యూహాత్మక
రంగాల్లో గరిష్ఠంగా 4 పీఎ్‌సయూలనే కొనసాగిస్తామని, మిగతా
వాటిని ప్రైవేటుపరం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ప్రైవేటీకరణే.. విలీనాలుండవిక..
గత ఏడాది మోదీ
సర్కారు ఒకేసారి 10 పీఎ్‌సబీల విలీనం ద్వారా 4 బడా ప్రభుత్వ బ్యాంకులను ఏర్పాటు
చేసింది. ఇంకా విలీనం చేయని బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
పరిస్థితులు కుదుటపడ్డాక వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రక్రియను
మొదలుపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మన దేశంలో ఐదుకు మించి
ప్రభుత్వ బ్యాంకులక్కర్లేదని పలు ప్రభుత్వ కమిటీలు, ఆర్‌బీఐ ఇప్పటికే
సూచించిన సంగతి విదితమే.
0 Komentar