New reforms in Andhrapradesh Government text books
ఒకే పుస్తకంలో తెలుగు,
ఆంగ్ల మాధ్యమ పాఠాలు
సబ్జెక్టుకు 3 పాఠ్యపుస్తకాలు,
వర్క్‌బుక్‌లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు మోత
తగ్గించేందుకు, ఒత్తిడి
నివారణకు 1-6 తరగతుల్లో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యా
సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందించారు.
ఒక్కో సబ్జెక్టుకు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్‌లు
అందిస్తారు. అలాగే భాషలకు సంబంధించి పుస్తకాలు ఒకే మాధ్యమంలో ఉంటాయి. ఒకే
పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను
ముద్రిస్తున్నారు. కన్నడం, తమిళం, ఉర్దూ
లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది. మొదటి విడత పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. విద్యార్థులకు
ఇచ్చే వర్క్ బుక్ లోనే తరగతి, హోం వర్కులకు సమాధానాలు
రాయాలి.
ఇదీ 3 విడతల విధానం...
>మొదటి విడత ముగింపులో విద్యార్థులు అప్పటివరకు నేర్చుకున్న
పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది.
>రెండో విడతలో మొదటి విడత నుంచి 20%, ప్రస్తుత పాఠ్యాంశాల నుంచి 80% ప్రశ్నలుంటాయి.
>మూడో విడతలో.. మొదటి, రెండు విడతల పాఠ్యాంశాల నుంచి 10% చొప్పున,
ప్రస్తుత పాఠాల నుంచి 80% ప్రశ్నలు ఇస్తారు.
0 Komentar