Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New Rs.1000 Procedures in Dr.YSR Aarogyasri Scheme, expansion to another six districts

New Rs.1000 Procedures in Dr.YSR Aarogyasri Scheme, expansion to another six districts
వెయ్యిదాటితే ఆరోగ్యశ్రీ ఈ నెల 16 నుండి మరో ఆరు జిల్లాలకు విస్తరణ
కొత్తగా కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అవకాశం
వైద్య సేవల ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని మరో ఆరు జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సిఇఒ డా.మల్లికార్జున్‌ సోమవారం సిఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. ఇప్పటిక పశ్చిమగోదావరి జిల్లాల్లో దీనిని ప్రైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ అమలు జరుగుతున్న తీరును అడిగిని తెలుసుకున్న సిఎం మరో ఆరు జిల్లాలకు విస్తరించాలని సూచించారు. దీంతో ఈ నెల 16 నుండి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో దీనిని అమలు చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపుచేస్తామని ఎన్నికల ప్రణాళికలో జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ హామీని దశల వారిగా రాష్ట్రమంతా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుండటంతో మరికొంత మంది ఇబ్బందులు పడుతున్నారని భావించిన సిఎం ఈ సంఖ్యను 2,146కు పెంచుతూ ఆదేశాలిచ్చారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్య ప్రక్రియలను కూడా అందించనుండటంతో మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకున్న 1,815 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags