News18 Survey: ఆన్‌లైన్ క్లాస్‌లు వద్దంటున్న తెలుగు ప్రజలు..
కరోనా
విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేదు. ఈ క్రమంలో
చాలా ప్రైవేట్ స్కూళ్లు ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌లో
జూమ్, గూగుల్ మీట్, జియో మీట్ వంటి
అప్లికేషన్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఐతే టెన్త్, ఇంటర్ విద్యార్థులతో పాటు ప్రైమరీ విద్యార్థులకు కూడా ఆన్ లైన్ క్లాస్‌లు
నిర్వహించడాన్ని చాలా మంది తల్లిదండ్రులు, విద్యావేత్తలు,
విద్యార్థి సంఘాలు తప్పుబట్టుతున్నాయి. అసలు ఆన్‌లైన్ క్లాసులే
వద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో డిజిటల్ విద్యపై తల్లిదండ్రుల అభిప్రాయాన్ని
తెలుసుకునేందుకు న్యూస్ 18 ప్రయత్నించింది. ఈ సర్వేలో చాలా
మంది పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రస్తుత
పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యాబోధన సమర్థవంతంగా ఉంటుందని మీరనుకుంటున్నారా? అన్న
ప్రశ్నకు మలయాళీలు, బెంగాలీలు అనుకూలంగా అభిప్రాయం తెలిపారు.
సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది బెంగాలీలు,
76.39 శాతం మంది మలయాళీలు ఆన్ లైన్ విద్యా బోధన సమర్థవంతంగా
ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఇక తెలుగు వారి
అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు న్యూస్ 18 తెలుగు సర్వే
చేపట్టింది. ఇందులో 69.66 శాతం మంది ఆన్‌లైన్ క్లాసులు
వద్దని చెప్పారు. 18.56 శాతం మంది మాత్రం ఆన్‌లైన్ విద్య
సమర్థవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఏమీ చెప్పలేమని 11.79 శాతం మంది సమాధానం తెలిపారు. బెంగాలీ, మలయాళీలు
మినహా మిగతా ప్రజల్లో ఎక్కువ మంది ఆన్‌లైన్ విద్యకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
News18 తెలుగు సౌజన్యం తో..
0 Komentar