NIOS Open schools Public Exams
2020 cancelled
ఓపెన్ స్కూల్
పరీక్షలు రద్దు : NIOS
దేశంలో కరోనా మహమ్మారి
తగ్గుముఖం పట్టకపోవడంతో అన్ని స్థాయిల్లోని ఓపెన్ స్కూల్ పరీక్షలను రద్దు
చేస్తున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ప్రకటించింది. ప్రస్తుత
పరిస్థితిలో ఈ 17న గతంలో నిర్ణయించిన విధంగా సెకెండరీ, సీనియర్
సెకెండరీ కోర్సుల పరీక్షలు నిర్వహణ సాధ్యం కాదని ఎన్ ఐఓఎస్ అభిప్రాయపడింది.లాక్
డౌన్ తర్వాత పరిస్థితి సద్దుమణిగితే ఆయా కోర్సుల పరీక్షలు నిర్వహిద్దామని
భావించింది. కానీ ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా గమనించిన తర్వాత పరీక్షలను
నిర్వహించలేమని ఎస్ఎఓస్ పరీక్షల విభాగం
సంచాలకులు బి వెంకటేశ్వరన్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. అయితే,ఇదివరకే కొన్ని పరీక్షలు జరిగిన నేపథ్యంలో తాము ఓ ప్రత్యేక నిర్ణయం
తీసుకున్నట్టు ఆయన వివరించారు.
ఇప్పటివరకు రాసిన పరీక్షల్లో ఫలితాల సగటును పరిగణనలోకి తీసుకొని ఆ
విద్యార్థి పూర్తి మార్కుల ఫలితాన్ని నిర్ధారించనున్నట్టు చెప్పారు. ఇక తొలిసారి
రాస్తున్నవారికి మాత్రం సంబంధిత ట్యూటర్ ఇచ్చిన అసైన్మెంట్ ప్రకారం మార్కులు
కేటాయించి ఫలితాన్ని ప్రకటిస్తామని చెప్పారు. మార్కులతో కూడిన వివరాలను
వెల్లడించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.
NIOS Notification details
0 Komentar