ఉన్నత విద్యలో
తొలిసారిగా ‘ఫలితాల ఆధారిత పాఠ్యాంశాలు’
డిగ్రీలో 10 నెలల
నిర్బంధ అప్రెంటిస్‌షిప్
2020–21
నుంచి అమలులోకి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు
రాష్ట్రంలో
తొలిసారిగా ఉన్నత విద్యాకోర్సుల్లో అవుట్ కమ్ బేస్డ్ సిలబస్
ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ
విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్యాంశాలు అమల్లోకి వస్తుందన్నారు. యూజీసీ సూచనలకు
అనుగుణంగా డిగ్రీలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ విధానాన్ని(సీబీసీఎస్) 2015-16లో
ప్రవేశ పెట్టారు. మొదట్లో సీబీసీఎస్ పాఠ్యాంశాలున్నా క్రెడిట్ మార్పు అవకాశం
విద్యార్థులకు కల్పించలేదు. తాజా సిలబస్‌లో ఈ మార్పు తీసుకొచ్చారు.
ఈ సిలబస్‌లో
ముఖ్యాంశాలు..
* ఈ విద్యా
సంవత్సరం నుంచి మొదటిసారిగా ఫలితాల ఆధారిత పాఠ్యాంశాలను తీసుకొచ్చారు.
* ఫౌండేషన్
కోర్సుల స్థానంలో జీవన నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టారు. సెమిస్టర్‌కు ఒక కోర్సు
చొప్పున 3సెమిస్టర్‌లకు మూడింటిని విద్యార్థులు ఎంపిక చేసుకోవాలి. నాల్గో
సెమిస్టర్‌లో పర్యావరణ విద్య ఉంటుంది.
*
నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో మూడు సెమిస్టర్లలో నాలుగు కోర్సులను చదవాల్సి
ఉంటుంది. రెండో సెమిస్టర్‌లో రెండు కోర్సులను తీసుకోవాలి.
* ఫౌండేషన్
కోర్సుల స్థానంలో లైఫ్ స్కిల్ కోర్సులను ప్రవేశపెట్టడం. లైఫ్ స్కిల్ కోర్సులను
ఎంపిక చేసుకొనే అవకాశం విద్యార్థులకే కల్పించడం.
* చివరి ఏడాది
ఐదో సెమిస్టర్‌లో నైపుణ్యాల పెంపుపై ఆరు కోర్సులు ఉంటాయి.
* నైపుణ్యాభివృద్ధిని
పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్‌మెంట్, స్కిల్ ఎన్‌హేన్స్‌మెంటు
కోర్సులకు రూపకల్పన.
* సీఎం జగన్
సూచనల మేరకు తొలిసారి విద్యార్థులందరికీ 10 నెలల నిర్బంధ అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్
(ఉద్యోగావకాశాల మెరుగుకు) ఈ సిలబస్ ప్రత్యేకత. ఇది మొదటి, రెండు
ఏడాదుల్లో వేసవి సెలవుల్లో రెండు నెలలు చొప్పున ఉంటుంది.
* విద్యార్థులు, కళాశాలలను
సమాజంతో అనుసంధానం చేసేందుకు కమ్యూనిటీ సేవల ప్రాజెక్టును ఇంటర్న్‌షిప్‌లో భాగం
చేశారు. మొదటి ఏడాది పూర్తయిన వెంటనే ఇది ఉంటుంది.
* ఆన్‌లైన్ కోర్సులు
చేసేవారికి, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌జీసీలో
పాల్గొనే వారికి అదనంగా క్రెడిట్స్ ఉంటాయి.
0 Komentar