ఆన్ లైన్ క్లాసుల
పేరుతో ఫీజుల దోపిడీపై హైకోర్టుకు పేరెంట్స్
ప్రైవేటు
పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిషేధించాలన్న 'హైదరాబాద్ స్కూల్ స్టూడెంట్స్
పేరెంట్స్ అసోసియేషన్ వేసిన పిల్' పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. లాక్ డౌన్
వల్ల స్కూళ్లు, కాలేజీలు తెరవకపోయినా
ప్రైవేటు స్కూల్స్ ఫీజులు ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నామని.. పుస్తకాలు,
అడ్మిషన్ ఫీజులు కట్టాలంటూ ప్రతిరోజు తమకు ఫోన్లు చేస్తున్నారని
వారు ఆందోళన వ్యక్తం చేశారు. జీవో 46ని ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని
కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టు స్పందించి ఆన్ లైన్ క్లాస్ ల నిర్వహణపై
ప్రభుత్వం ఏమైనా సర్క్యులర్ జారీ చేసిందా అని ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే ఆన్ లైన్ క్లాస్ లను నిషేధించారని.. ఒత్తిడి
తీసుకురావద్దని ప్రభుత్వాలు పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వం
ఆన్ లైన్ క్లాస్ లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ల్యాప్ టాప్‌లు, ఫోన్‌లు కొనే ఆర్థిక స్థోమత అందరికీ
ఉంటుందా? ఆన్ లైన్ తరగతులపై ప్రభుత్వం స్పష్టమైన పాలసీ
రూపొందించడం లేదు. ఎల్లుండి లోగా వివరణ ఇవ్వాలి’’ ప్రభుత్వానికి
హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జులై 3కు వాయిదా వేసింది.
0 Komentar