రేపు
జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
ప్రధాని నరేంద్ర
మోదీ రేపు (శనివారం) సాయంత్రం 4:30 గంటలకు జాతినుద్దేశించి
ప్రసంగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘స్మార్ట్
ఇండియా హ్యాకథాన్ 2020’ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో
పాల్గొని విద్యార్థులతో ముచ్చటించనున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న
సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యంగా 2017 నుంచి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. ప్రారంభమైన తొలి
ఏడాదే 42వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2019కి ఆ సంఖ్య రెండు లక్షలకు పెరిగింది. ఇక ఈసారి తొలి రౌండ్‌కే 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తుది రౌండ్‌లో లక్ష మంది
పాల్గొననున్నారు. 37 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 17 రాష్ట్ర ప్రభుత్వాలు, 20 పరిశ్రమలు పంపిన సమస్యలకు
తుది రౌండ్‌లో విద్యార్థులు తమ పరిష్కారాలను తెలపనున్నారు
అలాగే నూతన
విద్యా విధానంపైనా ప్రధాని తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. విద్యా ప్రమాణాలు
అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మార్పులకు శ్రీకారం చుడుతూ కేబినేట్ నిర్ణయం
తీసుకున్నసంగతి తెలిసిందే.
0 Komentar