సురక్షిత
ప్రయాణంకోసం “పోస్ట్ కోవిడ్ బోగీ’’ తయారు చేసిన
భారతీయ రైల్వేశాఖ
కోవిడ్-19
పై పోరాటంకోసం కపూర్తలా ఫ్యాక్టరీలో రూపకల్పన
కోవిడ్ వైరస్ పై
పోరాటం కోసం కోవిడ్ అనంతర బోగీ పేరిట మెరుగైన సదుపాయాలతో వినూత్నమైన రైలుబోగీని
రైల్వేశాఖ రూపొందించింది. చేతులతో తాకాల్సిన అవసరంలేని సదుపాయాలు, రాగిపూత
పూసిన చేతి రెయిలింగ్స్, తలుపుల గడియలు, ఏసీ డక్టులలో ప్లాస్మా గాలి శుద్ధీకరణ వ్యవస్థ, టిటేనియం
డై ఆక్సైడ్ పూత తదితర ఏర్పాట్లు ఈ బోగీల ప్రత్యేకత.
రైలు ప్రయాణాల్లో
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు భారతీయ రైల్వేశాఖ పలు చర్యలు
తీసుకుంది. కోవిడ్ అనంతర బోగీ పేరిట మెరుగైన సదుపాయాలతో కూడిన రైలుబోగీని
తీసుకువచ్చింది. కపూర్తలా లోని రైలు బోగీల తయారీ కర్మాగారం ఈ విభిన్నమైన బోగీని
రూపొంచింది. చేతులతో తాకాల్సిన అవసరంలేని పలుసదుపాయాలు, రాగితో
పూతపూసిన చేతి రెయిలింగులు, తలుపుల గొళ్లాలు, ఏసీ డక్టులో గాలి శుద్ధీకరణకు ప్లాస్మా
వ్యవస్థ, టిటేనియం డై ఆక్సైడ్ పూత తదితర ప్రత్యేకతలతో
ఈ బోగీలను రూపొందించారు.
1. చేతులతో తాకాల్సిన అవసరంలేని సదుపాయాలు: కోవిడ్ వైరస్
వ్యాప్తి నిరోధమే లక్ష్యగా తయారు చేసిన కోవిడ్ రైలుబోగీలో చేతులు వాడాల్సిన
అవసరంలేని పలు సదుపాయాలు ఉన్నాయి. కాలి పాదంతో వాడటానికి వీలైన నీటి కుళాయి, సబ్బు
డిస్పెన్సర్, మరుగుదొడ్డి
తలుపు గొళ్లాలు కాలితోనే వాడగలిగిన ఫ్లష్ వాల్వు, కాలితోనే
వాడటానికి వీలైన మరుగుదొడ్డి తలుపు గొళ్లాలు, మోచేతి సాయంతో
తోయగలిగిన ప్రవేశద్వారపు తలుపు ఈ బోగీల్లో
ఏర్పాటు చేశారు.
2. రాగిపూత పూసిన చేతి రెయిలింగ్స్, గొళ్లేలు: ఈ
బోగీలకు రాగిలోహపు పూత పూసిన చేతి రెయిలింగ్స్, గొళ్లాలు
ఏర్పాటు చేశారు. ఎందుకంటే, తనఉపరితలంపై పడిన వైరస్ కణాలను
రాగి కేవలం కొన్ని గంటల్లోనే క్షీణింపజేస్తుంది. పలు సూక్ష్మజీవులను కట్టడిచేసే
స్వభావం కూడా రాగికి ఉంది. వైరస్ రాగిపై పడినపుడు రోగకారకమైన ప్యాథోజెన్లను రాగి
అయాన్ దెబ్బతీసి, వైరస్ లోని డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ.లను నాశనం చేస్తుంది.
3. గాలి శుద్ధీకరణకు ప్లాస్మా వ్యవస్థ: బోగీ ఎయిర్ కండిన్డ్ డక్టులో గాలి
శుద్ధీకరణకోసం ప్లాస్మా పరికర వ్యవస్థను ఏర్పాటు చేశారు. గాలిలోని హానికరమైన
బ్యాక్టీరియాను, ఏసీ బోగీలో ఉపరితలంపైన ఉండే బ్యాక్టీరియాను
ఇది సమర్థవంతంగా తొలగిస్తుంది.
4. టిటేనియం డైయాక్సైడ్ తో పూత: కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి
రూపొందించిన ఈ బోగీకి టిటేనియం డైయాక్సైడ్ పూత పూసి ఉంటుంది. ఇది ఫొటోయాక్టివ్
పదార్థంలా పనిచేసి అన్ని రకాల వైరస్ కణాలను, బ్యాక్టీరియాను,
శిలీంద్ర కణాలను నాశనం చేస్తుంది. బోగీలోని గాలి నాణ్యతను
మెరుగుపరుస్తుంది. ఈ పదార్థం ఏ మాత్రం
విషపూరితం కాదని అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా విభాగం
(ఎఫ్.డి.ఎ.) ధ్రువీకరించింది. చాలా సురక్షితమైనది, ప్రయాణికులకు
ఏ మాత్రం హానిచేయనిది అయిన టిటేనియం డైయాక్సైడ్ (TiO2 ) అనే ఈ ఫొటో యాక్టివ్ పదార్థాన్ని
వాష్ బేసిన్లు, లావెట్రీలు, సీట్లు,
బెర్తులు, స్నాక్ టేబుల్స్, కిటికీల గాజు తలుపులతో పాటుగా బోగీలోని దాదాపు ప్రతి ఉపరితలంపై పూతగా
వినియోగించారు. ఈ పూత 12నెలలపాటు ప్రభావవంతంగా పనిచేస్తుంది.
0 Komentar