ఆన్లైన్ తరగతుల
నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరి - పాఠశాల విద్య రెగ్యులేటరీ కమిషన్ సిఫారసు
-ఆరుబయట తరగతులపైనా
దృష్టి పెట్టాలి
విద్యార్థులకు
ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సి వస్తే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్
పాఠశాల విద్య కమిషన్ చైర్మన్ రెడ్డి కాంతారావు చెప్పారు. ఆన్లైన్ తరగతుల వల్ల
ఇబ్బందులపై కమిషనన్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థలను
ప్రారంభించాల్సొస్తే ఆరుబయట భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించడంపైనా దృష్టి
సారించాలని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్
సూచించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులకు అవసరమైన వనరులు
గురించి ఆలోచించాలని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచడానికి
ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.
సూచనలు, అభిప్రాయాలు...
* తరగతులు
నిర్వహించాల్సివస్తే షిఫ్ట్ పద్ధతి, సిలబస్ తగ్గింపు, ఓపెన్ ఎయిర్ క్లాసులు లాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
*ఆన్లైన్
తరగతులను సెల్ ఫోన్, ట్యాబ్ లకే పరిమితం చేయకుండా భౌతిక అభ్యసన
ప్రక్రియను జోడించాలని, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు,
ఇంట్లో లభించే వస్తువులతో ప్రయోగాలు వంటివి విద్యార్థులతో
చేయించాలని తెలిపారు.
*మొబైల్
ల్యాబరేటరీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
*ఆన్లైన్ తరగతులు
జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు విధిగా పిల్లల దగ్గర ఉండాలని
సూచించారు.
* ఐదో తరగతిలోపు పిల్లలకు
తరగతులను నిర్వహించరాదని, ఒక వేళ తప్పనిసరిగా నిర్వహించాల్సివస్తే
అతి తక్కువ సమయాన్ని కేటాయించాలి.
* ప్రభుత్వ
ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెంచేందుకు ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వాలి.
0 Komentar