టీచర్ పోస్టుల
సర్దుబాటును పాఠశాలలు తెరిచేనాటికి పూర్తి చేయాలి
ఏటా విద్యార్థుల
సంఖ్య పడిపోతూ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ఎయిడెడ్ పాఠశాలలను బలోపేతం చేసే
దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్
(పరిపాలన) పి.పార్వతి నేతృత్వంలోని కమిటీ గురువారం ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్ మెంట్లు, ఉపాధ్యాయ
సంఘాలతో సమావేశం నిర్వహించింది. విద్యార్థులు లేక మూతపడుతున్న, తక్కువ మంది విద్యార్థులు కునారిల్లు తున్న పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు
రావాలంటే ఏం చేయాలో చెప్పండని కమిటీ కోరింది. ఇకపై ఎయిడెడ్ పాఠశాలలను
నిర్వహించలేమని ప్రతి జిల్లాలోని కొన్ని మేనేజ్మెంట్ ప్రభుత్వానికి లేఖలు రాశాయని
కమిటీ తెలిపింది. ఎయిడెడ్ స్కూళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ టీచర్స్ గిల్డ్ ఏపీ
టీజీ) ఈ కమిటీ దృష్టికి తీసుకొచ్చింది.
ఎయిడెడ్ విద్యా
సంస్థలలో టీచర్ పోస్టుల సర్దుబాటును ఎయిడెడ్ ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి.
అయితే,
ఆ ప్రక్రియను పాఠశాలల రీ ఓపెన్‌నాటికి పూర్తి చేయాలని సంఘాల నాయకులు
కోరారు. దీనిని పూర్తిస్థాయిలో చేపట్టాలేగానీ, బదిలీలతో
ఆపేయకూడదన్నారు. లేకపోతే ఎయిడెడ్ యాజమాన్యాల నుంచి న్యాయపరమైన సమస్యలు తలెత్తే
అవకాశం ఉందన్నారు. సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయ
పోస్టులపై చర్చ జరిగింది. ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్లకు పదోన్నతి కల్పించాలన్నారు.
సర్వీసు వ్యవహారాలను డీఈఓలకు బదులు మండల విద్యాశాఖాధికారులకు బదలాయించాలని
సూచించారు.
వ్యాయామ
ఉపాధ్యాయుల పదోన్నతులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉపాధ్యాయ
పోస్టులతోపాటు మినిస్టీరియల్ ఉద్యోగులను కూడా టేకోవర్ చేయాలని నాయకులు
సూచించారు. దీనివల్ల ఆర్‌జేడీ, డీఈఓ, ఎంఈఓ
కార్యాలయాలలో సుమారు 200 మంది మినిస్టీరియల్ సిబ్బంది
పెరిగే అవకాశం ఉందన్నారు. ఏ ప్రక్రియ చేపట్టినా దానిని పాఠశాలలు తెరిచేనాటికల్లా
పూర్తి చేయాలని, లేకపోతే విద్యా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం
ఉందని చెప్పారు. ఎయిడెడ్ స్కూల్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై 10 రోజుల్లో అభిప్రాయాలు తెలియజేయాలని మేనేజ్ మెంట్లను కమిటీ కోరింది.
0 Komentar