Regarding Re-opening of
schools:
Representatives of State Governments and Union Terrotories
సెప్టెంబరు 5
నుంచి పాఠశాలల పునఃప్రారంభం?
‘టీచర్స్ డే’ నాడు
ప్రారంభించాలని యోచన
రాష్ట్రంలో
పాఠశాలలను సెప్టెంబరు 5వ తేదీ నుంచి పునఃప్రారంభించే సూచనలు
కనిపిస్తున్నాయి. పాఠశాలల భద్రతా ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ నెల 15న వీడియో
కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలలను పునఃప్రారంభించే సమయాలను
తెలపాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. వీడియో కాన్ఫరెన్సులో వెల్లడించిన
వివరాల్లో ఏమైనా మార్పులు ఉంటే తెలపాలని శుక్రవారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు
ఉత్తర్వులు వచ్చాయి. బిహార్, దిల్లీ వంటి రాష్ట్రాలు
ఆగస్టులో తెరవనున్నట్లు ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు
ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి.
వాస్తవానికి
ఆగస్టు 3వ తేదీ నుంచే స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు గత నెలలో విద్యాశాఖ సమీక్ష
సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే, దీనిపై ఇప్పటి వరకు
అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే సెప్టెంబరు 5వ తేదీన 'ఉపాధ్యాయ దినోత్సవం' కనుక ‘జగనన్న
విద్యా కానుక’ కింద 36.1 లక్షల మంది
విద్యార్థులకు విద్యా కిట్(స్కూల్ బ్యాగ్, పాఠ్యపుస్త కాలు,
నోట్ బుక్స్, 3 జతల యూనిఫాం, బూట్లు, 2 జతల సాక్స్) అందజేసే కార్యక్రమాన్ని
ప్రారంభించే అవకాశం ఉన్నది.
0 Komentar