గ్రామ, వార్డు
సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్
గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 15, 16
తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం గుంటూరు జిల్లా లోని
కాజ సచివాలయంలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. ఈ ప్రయోగం ఇక్కడ విజయవంతమైతే
దశలవారిగా రాష్ట్రంలోని మిగిలిన చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం
చుట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే
ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్‌రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోనే
సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. దస్తావేజుకు సంబంధించిన వివరాలను మాత్రం
సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు.
0 Komentar