జూలై 4వ తేది తర్వాతే
జీతాలు ఇతర బిల్లుల చెల్లింపు
ద్రవ్య వినిమయ బిల్లు జూన్
17న శాసన మండలిలో ఆమోదం లభించనందున ఉద్యోగులకు జీతాలు, ఇతర బిల్లుల చెల్లింపులన్నీ జూలై 4వ తేదీ
తర్వాత జరుగుతాయని వ్యవసాయ మంత్రి కన్నబాబు, ముఖ్యమంత్రి
ముఖ్య సలహాదారు అజేయకల్లం తెలిపారు. నిబంధనల ప్రకారం 14 రోజుల్లో బిల్లును వెనక్కి
పంపకపోతే ఆమోదం పొందినట్లుగా భావిస్తారన్నారు. బుధవారం రాత్రికి 14 రోజులు
పూర్తవుతుందని గురువారం దస్త్రం తయారీ ప్రక్రియ మొదలై శనివారం నాటికి గవర్నర్
ఆమోదం లభిస్తుందని వివరించారు.
0 Komentar