SBI: New rules on ATM & cash withdrawal from savings
account
SBI నగదు ఉపసంహరణ, ఏటీఎం కొత్త రూల్స్ ఇవే.. తెలుసుకోండి
ప్రభుత్వరంగ దిగ్గజం
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)లో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధనలు వచ్చాయి. పరిమిత
సంఖ్యలో ఏటీఎం నుండి ఉచిత నగదును ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇస్తుంది. నగదు
ఉపసంహరణ ఉచిత పరిమితి మించితే ఛార్జీ ఉంటుంది. కానీ చిన్న, నో
ఫ్రిల్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవని ఎస్బీఐ తన వెబ్ సైట్‌లో పేర్కొంది.
నగదు ఉపసంహరణకు ..
సగటు నెలవారీ
మొత్తం (ఏఎంబీ) రూ.25000 వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖల్లో
రెండుసార్లు మాత్రమే నగదు ఉపసంహరించుకొనేందుకు అవకాశం ఉంటుంది. రూ.25,000-50000 అయితే 10 విత్‌డ్రావల్స్ ఉచితం. రూ.50,000-100,000 ఉంటే 15, రూ.లక్షకు మించి ఏఎంబీ ఉంటే అపరిమితంగా
నగదు వెనక్కి తీసుకోవచ్చు. పరిమితి దాటిన వారుమాత్రం ఒక్కో లావాదేవీకి రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో మాత్రం ఉచితంగా అపరిమిత
లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఏటీఎం నిబంధనలు
1)ఉచిత
ట్రాన్సాక్షన్స్ రూ.25,000 లోపు సగటు నెలవారీ మొత్తం ఉన్న
కస్టమర్ ఏటీఎంలో ఉచితంగా ఎనిమిది ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఎస్బీఐలో ఐదు,
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఇవి ఆరు మెట్రో
నగరాలకే వర్తిస్తాయి. ఇతర నగరాల్లో ఎస్బీఐలో 5, ఇతర ఏటీఎంలలో
5 వరకు చేసుకోవచ్చు.
2)రూ.లక్ష వరకు..
రూ.25,000 నుండి లక్ష వరకు యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ హోల్డర్స్ ఇతర
బ్యాంకు ఏటీఎంలలో ఎనిమిది వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మెట్రోల్లో 3,
ఇతర నగరాల్లో 5 చేసుకోవచ్చు. సొంత బ్యాంకు
ఏటీఎంలలో ఉచితంగా అపరిమిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. రూ.1,00,000 యావరేజ్ మినిమం బ్యాలెన్స్ ఉంటే ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా అన్‌లిమిటెడ్
ట్రాన్సాక్షన్స్ ఉచితం. అన్ని లొకేషన్స్‌లలో శాలరీ అకౌంట్ హోల్డర్స్‌కు అన్
లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉచితం.
3)ఒక్కో ట్రాన్సాక్షన్స్
పైన ఛార్జీ పరిమితి మించి ఏటీఎంలలో ట్రాన్సాక్షన్స్ చేస్తే ఒక్కోదానికి రూ.10 నుండి రూ.20
వరకు ఛార్జీ (జీఎస్టీ అదనం) వసూలు చేస్తారు. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు
వర్తిస్తుంది. నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 నుండి
రూ.8 వరకు ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇన్‌సఫిసియెంట్ బ్యాలెన్స్‌కు
రూ.20 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ విధిస్తుంది. 4) ఇక సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటులో 5 బేసిస్ పాయింట్ల
కోత విధించడంతో 31, మే నుంచి 2.7శాతం
వడ్డీ మాత్రమే లభించనుంది.
0 Komentar