పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు జారీచేసిన
తాజా ఉత్తర్వులు..
>u-dise+ అప్ డేట్ ను
జూలై 10 నాటికి పూర్తి చేయాలి.
>నాడు ౼ నేడు ఫేజ్
1 పనులు జరుగుతున్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్
సిబ్బంది అందరూ పాఠశాలకు హాజరు కావాలి.
నాడు నేడు లోని 9 అంశాలకు సంబంధించిన పనులను ఉపాధ్యాయులందరికీ పంపిణీ
చేయాలి. జులై 31 నాటికి సంబంధిత పనులను పూర్తి
చేయాలి.
>ఈ పనులకు
పాఠశాలలోని ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి
మినహాయింపు ఇవ్వాలి.
అన్ని పాఠశాలలకు వర్తించే అంశాలు..
>"పాఠశాలల
అభివృద్ధి ప్రణాళికను" పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి.
>రాబోవు అకడమిక్
ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సు ను అమలు చేయుటకు హైటెక్, లో టెక్, నో టెక్ ... వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి.
>ప్రైమరీ స్కూల్
విద్యార్థులకు ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం జులై 13 నుండి ఉపాధ్యాయులు వారంలో ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరు కావాలి.
>ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో
బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online &
offline తయారు చేసి వారి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేవిధంగా సంసిద్ధులను చేయాలి.
>విద్యార్థులందరికీ
స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి. పాఠశాలలు
రీ ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి.
>గత తరగతి
పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతి కి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ వర్క్స్
ఇవ్వాలి.
>విద్యార్థులతో
వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారి
విద్యాభ్యాసం మానిటర్ చేయాలి.
>పాఠశాల లోని
ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది విద్యార్థులను దత్తత
తీసుకోవాలి. పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేవరకు
వారి విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.
>ఉపాధ్యాయులందరికీ
సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి. stuap
>ఇందు నిమిత్తం
జులై 13 నుండి ప్రాథమికోన్నత, హై స్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం
పాఠశాలకు హాజరు కావాలి..
>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో
నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలు
విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు చేపట్టాలి...
School Education UDISE data 2019-20 Certain guidelines
Rc.No.145/A&I/2020, Dated: 05/07/2020
0 Komentar