సింగిల్ యూజ్
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
సింగిల్ యూజ్
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో
భాగంగా ప్లాస్టిక్ వినియోగం, విక్రయాలు, నిల్వలపై
భారీ జరిమానాలు విధించేందుకు రాష్ట్ర పురపాలిక శాఖ సిద్దమైంది. ప్లాస్టిక్‌కు
ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడమే కాకుండా.. రిటైలర్లు, వ్యాపారులు
ప్లాస్టిక్ వాడకం, అమ్మకాలు జరపకుండా ఉండేలా చర్యలు
తీసుకోవాలని ఆదేశించింది.
జరిమానాలు ఇలా
ఉన్నాయి..
>వ్యాపారులు, రిటైలర్లు
మొదటిసారిగా ప్లాస్టిక్ వినియోగిస్తే రూ. 2500 నుంచి రూ. 5000 వరకు జరిమానా
విధిస్తారు.
>అదే
రెండోసారి నిబంధనను ఉల్లంఘిస్తే వారి ట్రేడ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు.
>బహిరంగ
ప్రదేశాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పడేసేవారికి ప్రతీసారి రూ. 250 నుంచి రూ.
500 వరకు ఫైన్ వేస్తారు.
>ఇక ఉత్సవాలు, సామూహిక
కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగిస్తే రూ. 50,000 భారీ
జరిమానా విధిస్తారు.
సింగిల్ యూజ్
ప్లాస్టిక్ తో అనర్ధాలు..
సింగిల్ యూజ్
ప్లాస్టిక్ అనగా స్పూన్లు, కప్పులు, స్ట్రాలు,
బాటిల్స్, క్యారీ బ్యాగులు.. దేశంలోని మొత్తం
ప్లాస్టిక్ వ్యర్థాలలో 50% వీటి వల్లే జరుగుతోంది. ప్లాస్టిక్ కాలుష్యం జీవజాతుల
ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. దేశంలోని పంపునీటిలో 72 % ప్లాస్టిక్ రేణువులు
ఉన్నట్లు తేలింది. ఒక వ్యక్తి సంవత్సరానికి 3 వేల నుండి 4 వేల సూక్ష్మప్లాస్టిక్
కణాలను లేదా 250 గ్రాముల బరువు గల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నారని తేలింది. మన
శరీరంలో హార్మోన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఎండోక్రైన్ వ్యాధులు వస్తున్నాయి.
వ్యంధత్వానికి దారితీస్తోంది.
0 Komentar