Smart TVs for Government schools as part of the ‘Nadu-Nedu’ program
‘నాడు-నేడు’
కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ టీవీలు
‘నాడు-నేడు’
కార్యక్రమంలో భాగంగా దాదాపు 10వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత
పాఠశాలలకు త్వరలో స్మార్ట్ టీవీలు సమకూరనున్నాయి. ఒక్కో టీవీ ధర రూ.37వేల చొప్పున
టీసీఎల్‌కు కాంట్రాక్టు ఖరారైంది. రానున్న 3నెలల్లో 10వేల పాఠశాలలకు టీవీలను సరఫరా
చేసేవిధంగా రూ.45కోట్లు వ్యయం చేయనున్నారు.
ఇదిలా ఉండగా, 2020-21
విద్యా సంవత్సరం నుంచి 1-6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధన కొరకు..
రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో
ఇంగ్లిష్ లాంగ్వేజ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడానికి ఒక్కో పాఠశాలలకు రూ.లక్ష మంజూరు
చేయనున్నది. అయితే ఈ ల్యాబ్‌ల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారనే విషయమై ఇంకా
స్పష్టత రాలేదు.
0 Komentar