Suspected case
of bubonic plague in China's Inner Mongolia
చైనాలో బయటపడ్డ బుబోనిక్
ప్లేగ్ వ్యాధి
సరిహద్దులూ
దాటేసింది: పొరుగుదేశంపై పంజా
ప్రపంచాన్ని ఆక్రమించుకున్న
కరోనా వైరస్ చైనాలోని హ్యుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లో గత ఏడాది డిసెంబర్‌లో పుట్టుకొచ్చినట్లు
అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే జీ4
అనే మరో వైరస్‌ను కూడా డాక్టర్లు గుర్తించారు. జీ4 హెచ్1ఎన్1 వైరస్ ఇప్పుడిప్పుడే చైనాలో వ్యాప్తి
చెందుతోంది. అదే సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలో కొత్తగా బుబోనిక్ ప్లేగ్
పుట్టుకునిరావడం, ఇప్పటికే ఆ దేశ సరిహద్దులను దాటుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
పొరుగునే ఉన్న మంగోలియాపై పంజా విసురుతోంది.
మూడు రకాలైన
ప్లేగుల్లో.. బుబోనిక్ ప్లేగు ఒకటి. దీని వల్ల నొప్పులు, వంటి
వాపు, జ్వరం, వణుకుడు, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, చలి,
గొంతునొప్పి అనంతరం శరీరంపై పుండ్లు ఏర్పడటం వంటి లక్షణాలు
కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రిలో చేరాలని హెచ్చరించారు. 1911లో
వచ్చిన మహమ్మారి ప్లేగుకు మార్మట్ మాంసమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈశాన్య చైనాలో ఆ ప్లేగు వల్ల సుమారు 63 వేల మంది మరణించారు.
ఎలుకల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల ఎలుకల్లో
ఉండే ఎర్సీనియా పెస్టిన్ అనే బ్యాక్టీరియా ద్వారా బుబోనిక్ ప్లేగ్
పుట్టుకొచ్చిందని బయన్నూర్ డాక్టర్లు వెల్లడించారు. ఇదే తరహా బ్యాక్టీరియా కొన్ని
పురుగుల్లోనూ ఉంటుందని చెబుతున్నారు. బయన్నూర్‌లో మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను
తిన్న వారే ఈ బుబోనిక్ ప్లేగ్ బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వైరస్‌ను
కనుగొనేటప్పటికే దాని వ్యాప్తి ఆరంభమైందని బయన్నూర్ స్థానిక ప్రభుత్వాధికారులు
అనుమానిస్తున్నారు. అందుకే ఒకేసారి వందమందికి పైగా ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని
భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లెవల్-3 ప్రమాద
హెచ్చరికలను జారీచేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు.
0 Komentar