ఈ-ఆఫీస్ దిశగా
తెలంగాణ ప్రభుత్వం
మండలాఫీసు నుంచి
సచివాలయం దాకా కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే..
ఉద్యోగులు, అధికారులు ఆన్‌లైన్‌లోనే విధులు నిర్వర్తించి ప్రజలకు
సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి నుంచి అమలులోకి
రానున్న ఈ-ఆఫీస్ నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని
విభాగాలలో నోడల్ అధికారులను, టెక్నికల్ అసిస్టెంట్లను
నియమించారు. ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిర్వహణకు సంబంధించిన శిక్షణ కూడా
మొదలుపెట్టారు.
ఈ- ఆఫీస్
విధానంలో ప్రతి ఉద్యోగికి ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. అవి సదరు
ఉద్యోగి, అధికారి మాస్టర్ డాటాకు లింక్ అయి ఉంటాయి. దీంతో
ఎక్కడా ఆ ఫైల్‌ను దారి తప్పించడానికి ఎవ్వరికీ ఆస్కారం ఉండదు. అలాగే సదరు
ఉద్యోగికి నెట్ కనెక్షన్ ఉంటే చాలు ఇంటి వద్ద నుంచైనా పనిచేయవచ్చు. ఆన్‌లైన్
విధానంలో ఫైళ్ల స్థితిగతులను పైఅధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చు. వారు
తమ మొబైల్ ఫోన్‌లోనే ఫైల్‌ను ట్రాక్ చేయవచ్చు.
పెరగనున్న వేగం..
వైరస్
వ్యాప్తిని నివారించడంతో పాటు పనులకు ఆటంకం లేకుండా ఉండేలా కొత్త విధానం దోహదపడుతుంది.
ఎక్కడి నుంచైనా సంబంధిత ఫైళ్లను క్లియర్ చేసే వీలు ఉంటుంది. ఫైళ్ల నిర్వహణ సులభతరం
కావడంతోపాటు పారదర్శకత, విశ్వసనీయత, జవాబుదారీతనం
కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. జూలై రెండో వారం నుంచి రెవెన్యూ, విపత్తు నిర్వహణ, ఎక్సైజ్, వాణిజ్య
పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, దేవాదాయ
ధర్మాదాయ తదితర శాఖల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది.
0 Komentar