తెలంగాణలో ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ
కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలను రద్దు
చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. మార్చి, 2020లో జరిగిన ఇంటర్ ద్వితీయ
సంవత్సర పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి
తెలిపారు. ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు కంపార్ట్ మెంట్ లో పాస్ అయినట్లు మార్కుల
జాబితాలో పేర్కొననున్నారు. వీరు మార్కుల మెమోలను జులై 31న సంబంధిత కళాశాలల్లో
పొందవచ్చన్నారు. అయితే మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్
కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను 10 రోజుల్లో వెల్లడిస్తామని మంత్రి
సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షా 47 వేల మంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు
ప్రయోజనం చేకూరనుంది.
0 Komentar