Telangana: Open
school 10th class & Intermediate students declared as pass
తెలంగాణ ఓపెన్ స్కూల్
పది,
ఇంటర్ విద్యార్థులంతా పాస్
కరోనా దృష్ట్యా ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ
ప్రభుత్వం తాజాగా ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ విద్యార్థులందరినీ
పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్
స్కూలింగ్ తరహాలోనే రాష్ట్ర ఓపెన్ స్కూల్ పది, ఇంటర్
విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర
వ్యాప్తంగా పదోతరగతిలో 35 వేల మంది, ఇంటర్‌లో
43 వేల మంది విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా
విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థులు తమ మార్కులను పెంచుకోవాలనుకుంటే తర్వాత
నిర్వహించే పరీక్షలకు హాజరుకావలసి ఉంటుంది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించి కొద్ది
రోజుల్లో క్లారిటీ రానుంది.
0 Komentar