కాంట్రాక్టు
ఉద్యోగులకూ సకాలంలో జీతాలు
గ్రీన్ చానల్లో
పెట్టి నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు...
రెగ్యులర్ ఉద్యోగుల
తరహాలోనే వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో
జీతాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రీన్ చానల్లో
పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. సోమవారం
కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్మినెంట్
ఉద్యోగుల మాదిరిగానే వీరికీ సామాజిక, ఆరోగ్య భద్రతలపై అధ్యయనం నివేదికలు
త్వరగా ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు,
విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి
ఇబ్బందులూ రాకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన
తర్వాత 2019 జూలై నుంచి మినిమం టైం స్కేల్ అమలు చేస్తున్నారు. ఫలితంగా 2017
మార్చి 31న ఉన్న జీతాలు.. 2019 జూలై నాటికి 88 శాతం నుంచి 95 శాతం వరకు పెరిగాయి.
0 Komentar