Twitter accounts hacked in Bitcoin scam
ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ కలకలం
ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ కలకలం
అమెరికాలో
అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న ఏడాదిలోనే సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో సైబర్
నేరగాళ్లు రెచ్చిపోయారు. రాజకీయ ప్రముఖులు, టెక్నాలజీ మొఘల్స్,
సంపన్నులే లక్ష్యంగా వారి ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్
అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్,
మీడియా మొఘల్ మైక్ బ్లూమ్‌బర్గ్, అమెజాన్
సీఈఓ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తోపాటు
యాపిల్, ఉబర్ వంటి సంస్థల అకౌంట్లు బుధవారం హ్యాక్
అయ్యాయి.
అధికారిక ఖాతాలను
హ్యాక్ చేసి క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు అందించాలని వారు కోరినట్లు సందేశాలు
పోస్టు చేశారు. పోస్టులో పేర్కొన్న బిటిసి అడ్రస్‌కు డబ్బు పంపితే రెట్టింపు
తిరిగి పంపిస్తాం అన్న సందేశంతో భారీ కుట్రకు పాల్పడ్డారు. వీరందరికీ చెందిన
అధికారిక ఖాతాల్లో పలు అనుమానాస్పద ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. 'అందరూ
నన్ను దానం చేయమని అడుగుతున్నారు. మీరు నాకు వెయ్యి డాలర్లు పంపిస్తే తిరిగి మీకు 2 వేల డాలర్లు పంపిస్తాను' అన్న సందేశంతో కూడా ట్వీట్
బిల్‌గేట్స్‌తో పాటు ఇతరుల అకౌంట్లలో దాదాపు అదే అర్ధంతో కనిపించింది.
ఎలా హ్యాక్
చేశారంటే..
బిట్‌కాయిన్
సొమ్ముల్ని రెట్టింపు చేసుకోండంటూ గతంలోనూ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి కానీ, ఇలా
పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఖాతాలు
హ్యాక్ కావడం ఇదే మొదటిసారి. దీనిని సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడిగా ట్విట్టర్
సపోర్ట్ టీమ్ అభివర్ణించింది. ట్విట్టర్‌లో అంతర్గతంగా ఉండే వ్యవస్థలు, టూల్స్ సాయంతో హ్యాకర్లు ట్విట్టర్ ఉద్యోగుల అడ్మినిస్ట్రేషన్
ప్రివిలేజెస్ సంపాదించారు. దాని ద్వారా ప్రముఖుల పాస్‌వర్డ్‌లు తెలుసుకొని మెసేజ్‌లు
పోస్టు చేశారని ట్విట్టర్ సపోర్ట్ టీమ్ తెలిపింది. వీలైనంత త్వరగా డబ్బులు
సంపాదించడమే వారి లక్ష్యమని ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని
హెచ్చరించింది.
కాగా, ప్రముఖుల
ఖాతాల హ్యాక్ విషయాన్ని ట్విట్టర్ సంస్థ ధ్రువీకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి
విచారణ జరపడంతో పాటు సెక్యూరిటీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు
ట్విట్టర్ సపోర్టు టీం వెల్లడించింది.
0 Komentar