ఏపీలో విద్యా
వారధి మొబైల్ వాహనాలు ప్రారంభం..
ఎలాంటి సాంకేతిక
పరిజ్ఞానం, అనుభవం లేని విద్యార్థుల కోసం ఏర్పాటు..
ఏపీలో అనేక మంది
విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అనుభవం లేదన్న విద్యాశాఖ మంత్రి
సురేష్... అలాంటి వారి కోసమే విద్యా వారధి మొబైల్ వ్యాన్ ప్రతి జిల్లాకు వెళ్లి
విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13
జిల్లాలకు విద్యా వారధి మొబైల్ వాహనాలు అందుబాలోకి తీసుకువచ్చినట్లు ఆయన
తెలిపారు. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్
ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి సురేష్ వివరించారు.
ఎల్‌సీడీ
ప్రొజెక్టర్‌తో కూడిన ఈ-మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల్లోని విద్యార్థులకు పాఠాలు
బోధిస్తారు. ఈ వాహనంలో చిన్న లైబ్రరీ, ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు.
ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీ అందులో
పొందుపర్చాం. ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కొండ ప్రాంతాల్లో ఈ-మొబైల్ వ్యాన్‌లను వినియోగించుకునేందుకు
అవకాశం ఉంటుంది’’ అని మంత్రి వివరించారు. సెప్టెంబర్ 5
తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని.. విద్యా
వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయబోమని సీఎం జగన్ చెప్పారని మంత్రి సురేష్
మరోసారి స్పష్టం చేశారు.
0 Komentar