Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

We send kids to school after COVID-19 vaccine arrives

వ్యాక్సిన్‌ వచ్చాకే మా పిల్లలను బడికి పంపిస్తాం
- హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వేలో 60-70 % మంది తల్లిదండ్రులు అభిప్రాయం
అన్‌లాక్‌ -3లో భాగంగా ఆగస్టు 31 వరకు పాఠశాలలు మూసివేయాలని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు తరువాత కూడా పాఠశాలలు తెరుచుకునే సూచనలు కనిపించుటలేదు. అయితే తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వే నిర్వహించారు. సర్వేలోని ముఖ్యాంశాలు ఒకసారి చుస్తే..
>హైదరాబాద్‌ జిల్లాలో 60% మంది తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ వచ్చాక తమ పిల్లలను పాఠశాలలకు పంపుతామని చెప్పారు.
>మేడ్చల్‌ జిల్లాలో 71 % మంది వ్యాక్సిన్‌ వచ్చాకే అంటూ స్పష్టంచేశారు.
> ఆన్‌లైన్‌ ద్వారా అనగా చరవాణి ద్వారా బోధన చేయొచ్చని 41 % మంది పేర్కొనగా 27 % మంది టీవీ ఛానెళ్ల ప్రసారాలకు ఓటు వేశారు.
> ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే 52 % మంది చరవాణి ఇస్తామని చెప్పగా, 24 % మంది ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. మిగిలినవారు ట్యాబ్‌ వంటి ఇతర ఐచ్ఛికాలు సూచించారు.
>పాఠశాలలను కొన్నాళ్ల తర్వాత ప్రారంభించినా రోజు విడిచి రోజు నడపాలని 45 % మంది తల్లిదండ్రులు చెప్పగా, ప్రతిరోజు నడపాలని 24 % మంది సూచించారు.
> సిలబస్‌ను 50 % తగ్గించాలని 39 % మంది అభిప్రాయం వ్యక్తం చేసారు.
> ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే 52 % మంది చరవాణి ఇస్తామని చెప్పగా, 24 % మంది ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. మిగిలినవారు ట్యాబ్‌ వంటి ఇతర ఐచ్ఛికాలు సూచించారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags