What's app
announces five new features
వాట్సాప్లో ఐదు సరికొత్త
కొత్త ఫీచర్స్
వాట్సాప్ లో
త్వరలో మరో ఐదు కొత్త ఫీచర్లు రానున్నాయని కంపెనీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెబ్
వాట్సాప్కు డార్క్ మోడ్, క్వాలిటీ వీడియో కాల్స్, కైఓఎస్కు
మాయమైపోయే స్టేటస్, యానిమేటెడ్
స్టిక్కర్స్, క్యూఆర్ కోడ్స్ లను
త్వరలోనే అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రకటించింది.
క్యూఆర్ కోడ్: క్యూ
ఆర్ కోడ్ ద్వారా వ్యక్తి కాంటాక్ట్ ను స్కాన్ చేసి, సేవ్ చేసుకునే
సదుపాయం రానుంది.
వీడియో క్వాలిటీ: కాల్లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఫోకస్ అయ్యేలా మార్పులు చేర్పులు చేస్తోంది.
యానిమేటెడ్
స్టిక్కర్స్: చాటింగ్ను మరింత
ఫన్గా మార్చే యానిమేటెడ్
స్టిక్కర్స్ను వాట్సాప్
తీసుకురానుంది.
వెబ్కు
డార్క్మోడ్: ఇదివరకు
ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే డార్క్ మోడ్ అందుబాటులో ఉండగా
ఇప్పుడు వెబ్ వర్షన్ కు కూడా అందుబాటులోకి రానుంది.
మాయమైపోయే స్టేటస్:
స్టేటస్ తనంతట అదే మాయమైపోయే ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో
అందుబాటులో ఉంది. కాగా, దీన్ని ఇప్పుడు కైఓఎస్కు
వాట్సాప్ విస్తరించనుంది.
0 Komentar