Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WHO also believes that corona infection could spread through air

WHO also believes that corona infection could spread through air
కరోనావైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలున్నాయనే వాదనల్ని కొట్టిపారేయలేమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

గాలి ద్వారా కరోనా వైరస్‌ వ్యాపిస్తుందని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన స్వరం మార్చింది. గాలిలో చిన్న కణాల ద్వారా కరోనావైరస్ వ్యాపిస్తుందనడానికి ఆధారాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. జనం రద్దీ ఉన్న ప్రాంతాల్లో, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో, ఇరుగ్గా ఉండే గదుల్లో గాలి ద్వారా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అంటోంది.
కరోనావైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలను డబ్ల్యుహెచ్ఓ తక్కువ అంచనా వేస్తోందని ఆరోపిస్తూ ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్‌ఓకి ఒక లేఖ రాశారు. కరోనా సూక్ష్మ క్రిములు (5 మైక్రాన్ల కంటే చిన్నవి) గాలిలో ఒక మీటర్‌ పరిధిలో విస్తరించి చాలా ఎక్కువ సేపు ఉంటాయని, ఆ గాలి పీల్చే వారికి వైరస్‌ సోకుతుందని డబ్ల్యూహెచ్‌ఓకి రాసిన లేఖ లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ టెక్నికల్‌ లీడ్‌ బెనెడెట్టా అలెగ్రాంజి గాలి ద్వారా వైరస్‌ వ్యాపించదని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. వైరస్‌ గాలిలో ఎంతసేపు ఉంటుందో, ఆ సమయంలో మరొకరికి సోకే అవకాశం ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియవలసి ఉందని చెప్పారు. అయితే ఇప్పటివరకు కోవిడ్‌ రోగి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మి నప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఒ చెబుతున్న విషయం తెలిసిందే.
గాలి ద్వారా వ్యాపిస్తుందన్న అధ్యయనాలివే..
>రోగులు మాట్లాడేటప్పుడు అత్యధికంగా తుంపర్లు బయటకు వస్తే గాల్లో ఎక్కువ సేపు వైరస్‌ ఉంటోందని యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ మేలో చేసిన అధ్యయనంలో తేలింది.
>ఆస్పత్రిలో కారిడార్లలో కంటే చిన్న గదుల్లో, టాయిలెట్లలో గాల్లో వైరస్‌ ఎక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలిందని మొదటిసారిగా నేచర్‌ పత్రిక ప్రచురించింది.
>అమెరికాలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ (ఎన్‌ఈజేఎం) ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనంలో వైరస్‌ గాలిలో మూడు గంటల వరకు ఉంటుందని తేలింది.
ఏది ఏమైనా గాలి ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్న నేపధ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్కులు ధరించడం, జనం గుమిగూడే కార్యక్రమాల్ని పూర్తిగా రద్దు చేసుకోవడం ఎంతైనా మంచిది.

Previous
Next Post »
0 Komentar

Google Tags