All Inter Students will be passed who paid
fee
ఫీజు చెల్లించి పరీక్ష రాయని ఇంటర్
విద్యార్థులంతా ఉత్తీర్ణులే..
మార్చిలో ఇంటర్మీడియట్ పబ్లిక్
పరీక్షలకు ఫీజు చెల్లించి, పరీక్షలకు హాజరుకాకుండా అనుత్తీర్ణులైన
వారిని ఉత్తీర్ణులు చేస్తూ విద్యా శాఖ మంత్రి సురేష్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి
పరీక్షలకు సుమారు 44 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించినా
కొన్ని సబ్జెక్టులు రాయ లేదు. ఇలాంటి వారికి ప్రతి సబ్జెక్టులోనూ ఉత్తీర్ణతకు
అవసరమయ్యే మార్కు లను కలపనున్నారు. కరోనా కారణంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పరీక్షలను రద్దు చేయడంతో మార్చిలో పరీక్షలకు హాజరుకాని వారు ఏడాది సమయాన్ని
కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీని పై విద్యార్థులు, తల్లిదండ్రుల
నుంచి వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్కుల జాబితాలో కంపా ర్టుమెంట్
ఉత్తీర్ణతగా పేర్కొంటారు. పరీక్షల్లో చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి అడ్వాన్స్డ్
సప్లిమెంటరీకి అర్హత ఉన్న మరో 66 మంది విద్యార్థులు లను
ఉత్తీర్ణులుగా ప్రకటించారు. షార్ట్ మెమోలను బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వెబ్ సైట్లో (bie.ap.gov.in)
అందుబాటులో ఉంచనున్నారు.
You may also like these Posts
0 Komentar