Board exams to
be allowed twice a year as per new NEP 2020: HRD Minister
10వ తరగతి, ఇంటర్‌కు
అవసరం మేరకు ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు: పోఖ్రియాల్
పదవ తరగతి, ఇంటర్
విద్యార్థులకు అవసరం మేరకు బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో
వెల్లడించారు. ఈ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభకు మాత్రమే పరీక్ష ఉంటుంది
తప్ప.. వారి జ్ఞాపకశక్తికి కాదని ఆయన వివరించారు. ‘‘విద్యార్థులందరికీ
వారి విద్యాసంవత్సరంలో బోర్డు పరీక్షలు రెండుసార్లు రాసేందుకు అనుమతించనున్నాం.
ఒకేసారి తుది పరీక్షలు అంటే విద్యార్థుల్లో ఉండే భయం తగ్గుతుంది. ప్రధాన పరీక్షతో
పాటు అవసరమైతే మరో పరీక్షను అదనంగా నిర్వహిస్తాం’’ అని రమేశ్
స్పష్టం చేశారు. పలు మార్పులతో కూడిన జాతీయ విద్యావిధానాన్ని కేబినెట్ గతవారం
ఆమోదించిన సంగతి తెలిసిందే. ఉచిత విద్యను 18ఏళ్ల వరకూ పొడిగించడం, 10+2 విధానం బదులు 5+3+3+4 విధానం, ఉన్నత విద్యకు
ఒకే నియంత్రణ సంస్థ వంటి పలు మార్పులను కొత్త విధానంలో కేంద్రం ప్రవేశపెట్టింది.
0 Komentar