బడుల్లో భోజనంతో పాటు
అల్పాహారం..!
విద్యార్థులకు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పా హారం అందివ్వాలని కేంద్ర కేబినెట్ తాజాగా
ఆమోదించిన నూతన విద్యా విధానంలో ప్రతిపాదించింది. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులు
మెరుగ్గా విద్యను అభ్యసించలేరని, ఉదయమే వారికి బలవర్ధక ఆహారం అందించడం
వల్ల వారి కుశాగ్ర బుద్ధి మెరుగవుతుందని పేర్కొంది. వేడివేడి ఆహారం అందించలేని
ప్రాంతాల్లో బెల్లంతో పాటు ఉడికించిన వేరు శనగ, శనగ, అందుబాటులో ఉండే ఫలాలు ఇవ్వవొచ్చని సూచించారు క్రమం తప్పకుండా వైద్య
పరీక్షలు జరపాలని, సంపూర్ణ టీకా విధానం అవలంబించాలని,
హెల్త్ కార్డు జారీ చేయాలని పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లలకు
బాలవాటికల్లో ప్లే స్కూల్ విధానంలో విద్యాభ్యాసం జరపాలని సూచించింది.
0 Komentar