Don't postpone JEE and NEET
జేఈఈ, నీట్
జాష్యం చేయొద్దు: విద్యావేత్తలు
ఇంజనీరింగ్, వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ,
నీట్ పరీక్షలను ఆలస్యం చేయడం మంచిది కాదని దేశ విదేశాలకు చెందిన
విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ పరీక్షలు జాప్యం చేయడ మంటే విద్యార్థుల
భవిష్యత్తుతో రాజీ పడడమేనని పేర్కొన్నారు. ఈ మేరకు 150మందికి
పైగా విద్యావేత్తలు గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు సెప్టెంబరులో
నిర్వహించతలపెట్టిన ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న
నేపథ్యంలో వీరి లేఖ ప్రాధాన్యం సంతరించు కుంది. విద్యావేత్తల్లో రాసిన లేఖలో
"కొందరు తమ సొంత రాజకీయ ఎజెండా కోసం విద్యార్థుల భవిష్యత్తుతో మాట్లాడేందుకు
ప్రయత్నిస్తు న్నారు" అని పేర్కొన్నారు. ప్రవేశాలు, తరగతులు
ఎప్పుడు జరుగుతాయో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని.. ఈ సమస్యను
సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని లేఖలో కోరారు. కాగా, దేశవ్యాప్తంగా
విద్యార్థులు జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలనే
కోరుకుంటున్నారని కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఇప్పటికే 17
లక్షల మందికి పైగా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని
తెలిపారు. మరోవైపు నీట్ జేఈఈ పరీక్షలు వాయిదా కోసం సుప్రీం కోర్టు ఆశ్రయించాలి
కోరుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. తెలంగాణ, ఏపీ
సీఎంలు కె.చంద్రశేఖర రావు, జగన్మోహన్ రెడ్డి సహా 4 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు.
0 Komentar