Don’t promote final year students without exams : Supreme
పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్
చేయవద్దు: సుప్రీం
కళాశాల, వర్సిటీల
చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు
వెలువరించింది. పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది.
చివరి సంవత్సరం విద్యార్థులందరికీ సెప్టెంబరు 30లోపు
పరీక్షలు నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది. చివరి సంవత్సరం పరీక్షలు
నిర్వహించకుండా ప్రమోట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. కరోనా దృష్ట్యా
రాష్ట్రాలకు ఇబ్బందులు ఉంటే యూజీసీని సంప్రదించాలని పేర్కొంది. పరీక్షల గడువు
పెంచాలని రాష్ట్రాలు యూజీసీని కోరవచ్చని సుప్రీం తెలిపింది.
0 Komentar