Dr. Ambedkar University Degree and PG Admissions Started
Dr. Ambedkar University Degree and PG
Admissions Started
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ
అడ్మిషన్లు ప్రారంభం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ
ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో డిగ్రీ, పీజీ అడ్మిషన్ల ప్రక్రియ
ప్రారంభమై నట్లు కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక
ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో చేరేందుకు ఇంటర్, ఐటీఐ, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు అన్నారు. అలాగే 2016-2019
లో యూనివర్సిటీ డిగ్రీ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయిన వారు డిగ్రీలో
అడ్మిషన్ పొందవచ్చ న్నారు. పీజీ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు మూడు సంవత్సరాల
డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. డిగ్రీ, పీజీ,
పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవే శానికి వచ్చేనెల 10వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఇప్పటికే అడ్మి షన్ పొంది
సకాలంలో ఫీజులు చెల్లించలేనివారు కూడా ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు.
మరింత సమాచారం కోసం మాచవరం ఎస్ ఆర్ ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని
యూనివర్సిటీ అధ్యయన కార్యా లయంలో స్వయంగా, యూనివర్సిటీ వెబ్
సైట్ (https://braou.ac.in/) ,
7382929642 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.
You may also like these Posts
0 Komentar