Exams for Degree and PG will be held in
September
సెప్టెంబరు నుంచి డిగ్రీ, పిజి పరీక్షలు
కృష్ణా విశ్వవిద్యాలయంతోపాటు
అనుబంధ కళాశాలల్లో డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న
విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించనున్నారు. కొవిడ్ కారణంగా ఏప్రిల్‌లో
జరగాల్సిన పరీక్షలను గత నెల నిర్వహించాలని అనుకున్నా కరోనా వైరస్ తీవ్రమవుతున్న
కారణంగా ప్రభుత్వ ఆదేశాలతో మళ్లీ వాయిదా వేశారు. ప్రస్తుతం యూనివర్శిటీ గ్రాంట్స్
కమిషన్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు జారీ
చేయడంతో విశ్వవిద్యాలయ ప్రతినిధులు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
చేస్తున్నారు. సెప్టెంబరు 2 నుంచి 9వ తేదీ వరకు డిగ్రీ విద్యార్థులకు ప్రయోగ
పరీక్షలు, 14 నుంచి 26 వరకు థియరీ పరీక్షలు
నిర్వహించనున్నారు. పీజీ విద్యార్థులకు సెప్టెంబరు 4 నుంచి 11వరకు ప్రయోగ పరీక్షలు,
14నుంచి 21వరకు థియరీ పరీక్షలు జరుగుతాయి. కొవిడ్ కారణంగా డిగ్రీ
విద్యార్థులు అందరికీ ఒకేసారి కాకుండా విడతలవారీగా నిర్వహించనున్నారు. ఉదయం 9
నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సైన్సు విద్యార్థులకు, మధ్యాహ్నం
2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారులు
పరీక్షా కేంద్రాల సంఖ్య
జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ విద్యార్థులు
పరీక్షలు రాసేందుకు 53, పీజీ విద్యార్థులకు 9 పరీక్షాకేంద్రాలు
ఏర్పాటు చేస్తున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు మొత్తం 11,372 మంది
పరీక్షలు రాయనుండగా వారిలో సైన్సు విభాగ విద్యార్థులు 5,775, ఆర్ట్స్ విభాగ విద్యార్థులు 5,597, పీజీ చివరి సంవత్సర
విద్యార్థులు 2,400 మందికి గానూ సైౖన్స్ విద్యార్థులు 900, ఆర్ట్స్‌విద్యార్థులు
1500మంది ఉన్నారు. కొవిడ్ కారణంగా అన్ని పరీక్షాకేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
చేస్తున్నారు. ఒక గదికి 12మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాయడంతోపాటు
భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలన్నింటినీ ముందుగానే
శానిటైజ్ చేయడంతోపాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని
వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించి మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు
చేయాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల్లోనూ పరీక్షలు రాసేముందు, తరువాత కూడా విద్యార్థులకు శానిటైజర్ అందుబాటులో ఉంచడంతో పాటు థర్మల్
స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని, వైద్య సిబ్బందిని కూడా
అందుబాటులో ఉంచుతామని పరీక్షల నియంత్రణ అధికారి డి.రామశేఖరరెడ్డి తెలిపారు.
0 Komentar