Government to
bring helmets under mandatory BIS regime
ద్విచక్ర
వాహనదారులకు BIS హెల్మెట్లు తప్పనిసరి చేసే యోచనలో కేంద్రం
ద్విచక్రవాహనదారులకు
మరింత భద్రత కల్పించేలా BIS నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే దేశంలో
లభించేలా నియమాలను రూపొందించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర
రహదారులు, రవాణాశాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీచేసింది. దీని
ప్రకారం దేశంలో బీఐఎస్ నాణ్యత ఉన్న హెల్మెట్లు మాత్రమే తయారు చేసేలా, బీఎస్ఎ సర్టిఫికెట్ ఉండేలా చర్యలు చేపట్టనున్నది. దీనిపై 30రోజుల్లోపు ప్రజాభిప్రాయం తెలపడానికి గడువిచ్చింది. నిబంధనలు అమల్లోకి వచ్చిన అనంతరం ఐఎస్ 4151:2015 ప్రమాణాలకు తగ్గ హెల్మెట్లు మాత్రమే వాడాలని స్పష్టంచేసింది. దీనివల్ల
ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులు మరణాలపాలయ్యే అవకాశాలు తగ్గుతాయని చెప్పింది. నిబంధనలు
ఉల్లంఘించినవారికి జరిమానా ఉంటుందని పేర్కొంది.
0 Komentar