Home remedies for earache
చెవి నొప్పి
చెవి నొప్పి వచ్చినపుడు
పదునైన వస్తువుతో గుచ్చినట్టు ఉంటుంది. చెవి నొప్పిని, చెవిపోటు అని కూడా పిలుస్తారు. చెవి నొప్పికి చాలా
కారణాలు ఉన్నాయి.చెవి నొప్పి ఇతర సాధారణ సంకేతాలు, లక్షణాలతో కలిసి ఉంటుంది మరియు అది
స్వయంగా కొన్ని వ్యాధుల యొక్క సంకేతం. కావిటీస్, సైనస్ ఇన్ఫెక్షన్, ఇయర్వాక్స్ మరియు
టాన్సిలిటిస్ కొన్ని ధారణమైనవి. ఇన్ఫెక్షన్ కారణంగా మీ మధ్య చెవి వాపు లేదా ఎర్రబడి
ఉండవచ్చు. చెవి నొప్పి జ్వరం, స్వల్ప వినికిడి లోపం లేదా ఫ్లూ వంటి ఇతర లక్షణాలతో కూడి
ఉంటుంది. పిల్లలలో చెవి ఇన్ఫెక్షన్ చాలా సాధారణం. చెవి ఇన్ఫెక్షన్లు తరచుగా స్వయంగా
తగ్గుతాయి మరియు మందులు అవసరం లేదు. అయినప్పటికీ, మీరు ఇంట్లో చెవి నొప్పికి ఎలా చికిత్స
చేయవచ్చో తెలుసుకోవడం మంచిది. చెవి నొప్పికి హోం రెమెడీస్ పనిచేస్తాయని చెప్పే పరిశోధన
చాలా తక్కువ అయితే, చాలా మంది వైద్యులు ఈ చికిత్సలు ఇంట్లో ప్రయత్నించడం సురక్షితమని
అంగీకరిస్తున్నారు.
చెవినొప్పి అనిపించిన
వెంటనే మనం చెవిలో పుల్లలు పెట్టి తిప్పడం, చెవిలో కొబ్బరినూనె పొయ్యడం, గోరువెచ్చటి
నీరు పోసెయ్యడమో, వెల్లుల్లి రేకలతో కాచిచల్లార్చిన నూనె వెయ్యడం, తులసి వంటి ఆకు రసాలు
వేసెయ్యడమో చేసేస్తుంటాం. సరిగ్గా తెలుసుకోకుండా అరకొర జ్ఞానంతో చిట్కావైద్యాలు చేసెయ్యడం
వలన సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి చెవినొప్పి ఎందుకు వచ్చిందో, దాని తీవ్రత
ఎంత అనేది తెలుసుకుని ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.
చెవి నొప్పికి హోం రెమెడీస్
1.చెవిలో ఇన్ఫ్లమేషన్,
చెవినొప్పి ఉన్నప్పుడు, ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, చెవి నొప్పి ఉన్న ప్రదేశంలో
బయటవైపుగా దీన్ని అప్లై చేసుకోవాలి.
2.వెల్లుల్లి నూనె
మరియు ముల్లేనియన్ ఫ్లవర్ ఆయిల్ కలిపిన మిశ్రమం
మైక్రోబ్స్ ను నివారిస్తుంది మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.
3.ఆలివ్ ఆయిల్ ను
చెవిలో వేసుకుంటే చెవినొప్పి తగ్గుముఖం పడుతుంది.
4.చెవి నొప్పి, చెవికి
బయటవైపున ఇరిటేషన్ గా ఉన్నప్పుడు ల్యావెండర్ ఆయిల్ ను నొప్పి ఉన్నచోట పూసి సున్నితంగా
మర్దన చేయాలి.
5.నాజల్ పాస్ వేలో
బ్లాక్ అయిన్ ఫ్లూయిడ్స్ క్లియర్ చేయాలంటే మరిగే నీటిలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్
వేసి బాగా మరిగించి తర్వాత ఆవిరి పట్టాలి.
6.సాధారణంగా చెవినొప్పి
జలుబు వల్లే ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్లో జలుబు వ్యాధినిరోధకతను
ఎదుర్కొనే విటమిన్ ఎ, సి, ఇ ఆహారాలను తీసుకోవాలి.
7.చెవి నొప్పి ఉన్నప్పుడు
షార్ప్ గా ఉన్న వస్తువులను చెవిలో పెట్టుకోకూడదు. కాటన్ ఇయర్ బడ్స్ ను వేసి తిప్పకూడదు,
దానివల్ల చెవిలో మరింత దుమ్ము చేరే అవకాశం ఉంది.
0 Komentar