IGNOU Admission
2020: Deadline for admission and re-registration date extended
ఇగ్నో జూలై సెషన్
దరఖాస్తుల గడువు పొడిగింపు
ఇందిరాగాంధీ నేషనల్
ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ప్రవేశాల గడువును మరోమారు పొడిగించింది. డిగ్రీ, పీజీ, పీజీ సర్టిఫికెట్, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్, డొప్లొమా వంటి ఇతర కోర్సుల్లో జూలై
సెషన్‌కు సంబంధించిన ప్రవేశాల దరఖాస్తులను ఆగస్టు 16 వరకు
సమర్పించవచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం జూలై 31తో
ఈ గడవు ముగిసిపోయింది.
పీజీ రెండో
సంవత్సరం,
డిగ్రీ రెండు, మూడు సంవత్సరాల విద్యార్ధులు
రీరిజిస్ట్రేషన్ ఫీజును కూడా 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా
చెల్లించేందుకు ఇగ్నో అనుమతించింది. చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు చదువుతున్న
విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇగ్నో బి.కాం కోర్సుకు కూడా ఈ ఏడాది
అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నట్లు తెలిపారు.
ఎంఏ ఇంగ్లిష్, బీఏ
హిందీ, రూరల్ డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, అడల్ట్ ఎడ్యుకేషన్‌లో పీజీ సర్టిఫికెట్, ఎన్విరాన్‌మెంట్,
పాపులేషన్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌లో
అప్రిసియేషన్ కోర్సులతోపాటు మరో 24 కోర్సులను ఇగ్నో
అందిస్తున్నది.
0 Komentar