Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Mains exams start tomorrow



JEE Mains exams start tomorrow
జేఈఈ మెయిన్స్ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం

నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి
గడువుముగిశాక అనుమతించరు
కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరి
రాష్ట్రంలో 19 సెంటర్లు..
45 వేల మంది విద్యార్థులు
ఐఐటీ, ఎఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ సెప్టెంబర్ 6 వరకు పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుండి 660కి పెంచారు. ఇప్పటికే అడ్మిట్ కార్డులతో పాటు పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 8,58,278 మంది హాజరు కానుండగా రాష్ట్రం నుంచి 45 వేల మంది వరకు పరీక్షలు రాయనున్నారు.
అభ్యర్థులకు సూచనలివీ..
కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. గడువు సమయం ముగిశాక ఎవరినీ అనుమతించరు. పరీక్ష ముగిసేవరకు బయటకు వెళ్లేందుకు అనుమతించరు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎటీఏ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసి అడ్మిట్ కార్డులోని కోవిడ్-18 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్ టేకింగ్)లో వివరాలు నమోదు చేసి వెంట తెచ్చుకోవాలి. దానిపై ఫొటో అంటించి సంతకంతోపాటు ఎడమచేతి బొటనవేలి ముద్ర కూడా వేయాలి. అందులో గత 14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమస్యలు, శరీర నొప్పులు లేవని పేర్కొనాల్సి ఉంటుంది.
ఆధార్ లేదా ఇతర ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకో వాలి. సెల్‌ఫోన్లో స్కాన్ చేసిన గుర్తింపు కార్డులు చెల్లుబాటు కావు. అదనపు ఫొటో కూడా తేవాలి. రఫ్ వర్కు కోసం ప్రతి సీటు వద్ద ఏ-4 సైజ్ తెల్ల కాగితాలు 5 ఉంటాయి. బయటకు వెళ్ళేముందు 5 వర్కు షీట్లు, అడ్మిట్ కార్డు డ్రాప్ బాక్సులో వేయాలి. లేదంటే జవాబుల మూల్యాంకనం జరగదు. పరీక్ష కేంద్రాల్లో ప్రతి షిఫ్ ప్రారంభమయ్యే ముందు శుభ్రం చేయడంతోపాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచుతారు.

పరీక్ష కేంద్రాలివే: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం , శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాకపట్నం, విజయనగరం, నరసరావు పేట , సూరం పాలెం.


Previous
Next Post »
0 Komentar

Google Tags