JEE, NEET exams 2020 to be held as per
schedule
జేఈఈ, నీట్
పరీక్షలు యధాతధం-నేషనల్
టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన
వచ్చే నెల 1
నుంచి 6 వరకు జరుగనున్న జేఈఈ, నీట్
పరీక్షల నిర్వహణకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎట్టిపరిస్థితూల్లోనూ
అవి వాయిదా పడవని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)స్పష్టం చేసింది. ఈ మేరకు
శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
వచ్చేనెల 13న
తలపెట్టి నీట్(యూజీ)-2020కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో
అడ్మిట్‌కార్డులు జారీ చేయనున్నారు. కేంద్ర విద్యాశాఖ జారీ చేసిన మార్గదర్శకాల
ప్రకారం పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. “పరీక్షలు సురక్షితంగా,
భద్రంగా నిర్వహించడానికి మేం తీసుకున్న చర్యలకు విద్యార్థులనుంచి
ఎలాంటి సహకారం కావాలన్నదీ అందులో పేర్కొన్నాం’’ అని ఎన్టీఏ
పేర్కొంది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో దాఖలుచేసిన కేసులో న్యాయంలేదని
స్పష్టం చేసింది. దేశంలో మహమ్మారి సమస్య ఉన్నప్పటికీ జీవితం ముందుకెళ్లాల్సి
ఉంటుందని, దీని పేరుతో పరీక్షలను వాయిదా వేసి విద్యార్థుల
విలువైన కాలాన్ని వృథాచేయలేమని ఎన్టీయే అభిప్రాయపడింది.
0 Komentar