National Means Cum-Merit Scholarship (NMMS) Press Note
నేషనల్ మీన్-కమ్-మెరిట్
స్కాలర్షిప్ పరీక్ష నవంబరు 2016 అనగా ప్రాజెక్ట్ ఇయర్ 2017-18 కు సంబంధించిన ఫ్రెష్ మరియు రెన్యువల్ విద్యార్థులు ఏ కారణం వలన అయినా తమ
వివరములు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు నమోదు చేసుకొనలేకపోవడం వల్ల ఇప్పటి వరకూ
ఉపకారవేతనం పొందని పక్షంలో తమ పూర్తి వివరములతో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి
వారి కార్యాలయంలో సంప్రదించవలెను.
స్కాలర్షిప్ పరీక్ష హాల్ టికెట్, బ్యాంకు పాస్ బుక్,
ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ మొదలగు
వివరములను సెప్టెంబర్ 20 తేదీ లోగా సంబంధిత జిల్లా
విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించవలెను.
ఈ అవకాశం ప్రాజెక్ట్ ఇయర్ 2017-18 కు సంబంధించిన ఫ్రెష్ మరియు రెన్యువల్ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది
వివరములను సమర్పించుటకు ఇదే చివరి
అవకాశం అని, ఇక మీదట స్కాలర్షిప్ పోర్టల్ లో చేసుకొనని
విద్యార్థులకు ఇక ఎప్పటికీ స్కాలర్షిప్ మంజూరు కాబడదు అని మరియు 2021-22 వ
సంవత్సరం నుండి ఎటువంటి ఆఫ్ లైన్ ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకొనబడవు అని మానవ
వనరుల శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేసారు. మరిన్ని వివరములకు
సంబంధిత
జిల్లా విద్యాశాఖాధికారి వారి
కార్యాలయమును గానీ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయమును గానీ
సంప్రదించవలెను అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ. సుబ్బారెడ్డి గారు
తెలియజేసారు.
0 Komentar