ప్రతి యూనివర్సిటీలో
బహుళ కోర్సులు
-కనీసం 3
వేల మందితో జిల్లాకో వర్సిటీ
-నూతన
విద్యావిధానంలో కీలక అంశం
నూతన
విద్యావిధానం ప్రకారం ఐఐటీ, ఐఐఎంలతోపాటు లా యునివర్సిటీల్లోనూ ఆర్ట్స్,
సైన్స్, హ్యుమానిటీస్, ఫారెన్ లాంగ్వేజెస్.. ఇలా అన్ని రకాల కోర్సులను నిర్వహించాల్సి ఉంటుంది.
టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ విద్యాసంస్థలుగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు,
ట్రిపుల్ ఐటీలు అంతర్జాతీయ స్థాయి నాణ్యతను కలిగి ఉండగా.. మేనేజ్‌మెంట్
విద్యలో ఐఐఎంలు, వ్యవసాయ విద్యలో అగ్రికల్చర్ వర్సిటీలు..
ఇలా వివిధ కోర్సులకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాలు కొన్ని దశాబ్దాలుగా
కొనసాగుతున్నాయి. వీటిని సింగిల్ డిసిప్లినరీ వర్సిటీలుగా పేర్కొంటున్నాం. ఇక
తప్పనిసరిగా ఇవన్నీ మల్టీ డిసిప్లినరీ కోర్సులను బోధించాల్సి ఉంటుంది. వచ్చే 20 ఏళ్లలో దేశంలో అన్ని విద్యాసంస్థలు అన్ని కోర్సులను అందించాలని ప్రభుత్వం
లక్ష్యంగా నిర్దేశించుకుంది.
దేశవ్యాప్తంగా
రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వర్సిటీలతో పాటు సెంట్రల్, డీమ్డ్,
ప్రైవేట్ వర్సిటీలన్నీ కలుపుకొని 907
ఉన్నాయి. 2030లోగా ప్రతి జిల్లాకు ఒక వర్సిటీ ఉండాలన్నది
కేంద్రం లక్ష్యం. వర్సిటీలు స్థానికంగా ఉంటే అందరికీ ఉన్నత విద్య అందుబాటులో
ఉంటుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది.
0 Komentar