ఉద్యోగుల మార్చి,ఏప్రిల్
నెలల వేతన బకాయిలు 12%వడ్డీ తో చెల్లించండి: ఏపీ హైకోర్ట్
ప్రభుత్వ
ఉద్యోగులకు, పెన్షనర్లకు మార్చి, ఏప్రిల్
నెలల్లో వాయిదా వేసిన 50 శాతం జీతాన్ని, పెన్షన్‌ను 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని
హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ వల్ల ఆదాయం భారీగా పడిపోయిన
నేపథ్యంలో జీతాలు, పెన్షన్లో 50 శాతం వాయిదా
వేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 26, దీనికి అనుగుణంగా జారీ
చేసిన జీవో 37లను హైకోర్టు రాజ్యాంగ, చట్ట
విరుద్ధంగా ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు
సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం
తీర్పునిచ్చింది. వాయిదా వేసిన జీతాలు, పెన్షన్లను
చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ రిటైర్డ్ జిల్లా జడ్జి
డి.లక్ష్మీకామేశ్వరి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
0 Komentar