రాఖీ, రక్షా
బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి
లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల
మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ
ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా
జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు.
అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ
సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు
జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని
కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటూరు.
రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే..?
పూర్వం దేవతలకు, రాక్షసుల
కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు
నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో
తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస
రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం
చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది.
సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి
కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను
దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను
తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక
ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా
ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.
ఎలా జరుపుకుంటారు..?
రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం
చేసి,
కొత్త బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు. అక్కచెల్లెళ్లంతా
బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పడు `‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల’`
అనే స్తోత్రాన్ని కూడా చదువుతారు. `ఎలాగైతే ఆ
విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇతణ్ని అన్ని కాలాలలోనూ విడవకుండా ఉండు` అని దీని అర్థం. ఆ తరువాత హారతిని ఇచ్చి, నుదుట
తిలకాన్ని దిద్దుతారు. దానికి సంతోషపడిపోయే సోదరులు తమ ప్రేమకు గుర్తుగా
వారికి చక్కటి బహుమతులను అందిస్తారు.
0 Komentar