RBI stops
printing of two thousand notes
మరింతగా తగ్గనున్న
రూ.2 వేల రూపాయల నోట్ల సంఖ్య
నగదురహిత
లావాదేవీలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెద్దనోటు ముద్రణకు ఫుల్‌స్టాప్
పెట్టింది. నాలుగేళ్ల క్రితం రూ. 1,000, పాత 500 నోట్లను రద్దు చేసి దాని స్థానంలో రూ. 2,000 నోటును
ప్రవేశపెట్టిన ప్రభుత్వం క్రమంగా దాని ముద్రణను తగ్గిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా
2016–17లో ఏకంగా రూ. 354.29 కోట్ల రూ. 2 వేల నోట్లను ప్రింటింగ్ చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్, గతేడాది నుంచి
ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2016 నుంచి
ఇప్పటివరకు ముద్రించిన కరెన్సీ నోట్ల సంఖ్య వివరాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్
చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
గత నాలుగేళ్లుగా
ముద్రించిన రూ.2 వేల నోట్ల సంఖ్య (కోట్లలో)
సంవత్సరం రూ. 2 వేల నోటు
2016–17 354.29
2017–18 11.15
2018–19 4.66
2019–20 –
మొత్తం 370.1
0 Komentar