Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Schools start on Teacher's Day Only


Schools starts on Teacher's Day Only
ఉపాధ్యాయ దినోత్సవం రోజే పాఠశాలల ప్రారంభం
4 పథకాలు...ఒకే రోజు వేడుకలకు సర్వం సిద్ధం
అదే రోజున విద్యాకానుక పంపిణీ
నాడు-నేడు ప్రారంభం
 రాష్ట్రంలో సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి పాఠశాల విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజున ఉపాధ్యాయ దినోత్సవం కూడా ఉండటంతో, అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ సూచనలు చేసింది. పాఠశాలలు తెరుచుకునే రోజునే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు- నేడు పథకం తొలి దశ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభింపజేయాలని భావిస్తున్నారు. అలాగే ఇప్పటికే క్షేత్రస్థాయిలో మండల రిసోర్స్ సెంటర్లకు(ఎంఆర్సీ) పంపిణీ చేస్తున్న విద్యాకానుక కిట్లను కూడా విద్యార్థులకు అందజేయాలని నిర్ణయించారు. దీంతో మొత్తంనాలుగు వేడు కలకు ఒకే తేదీ వేదికగా మారనుంది.

హ్యాష్ ట్యాగ్ క్యాం పెయిన్..

ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈసారి వినూ త్న ప్రచారం చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా వర్చ్యువల్ గా ప్రత్యేక క్యాంపెయిన్ చేయనుంది. టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులసేవలను గౌరవించుకునేందుకు, ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రెండు హ్యాష్ ట్యాగ్ లతో ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ మేరకు 'అవర్ టీచర్స్ అవర్
హీరోస్, టీచర్స్ ఫ్రమ్ ఇండియా' అనే హ్యాష్ ట్యాగ్ లతో అన్ని కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని సూచించింది.
అందులో భాగంగా విద్యార్థుల తెల్లకాగితాలపై తమతమ ఉపాధ్యాయుల పేర్లు రాసి, వాటిని పట్టుకుని సెల్ఫీ దిగి టీచర్లకు పంపించడం ద్వారా మొదటి క్యాంపెయిన్ నిర్వహించాలని సూచించారు. రెండో హ్యాష్ ట్యాగ్ కోసం ఉపాధ్యాయులు తమ పాఠశాలలు, కళాశాలలతో షేర్ చేయాల్సి ఉంటుంది.

40 లక్షల మందికి కానుక..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్లు తదితరాలను అందిం చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలి సిందే. అందులో భాగం గా ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదాపుగా పూర్తయి, పంపిణీ దశలో ఉంది. మరోవైపు విద్యాకానుక కిట్లలోని షూస్, సాక్సులు, ఇతర వస్తువుల టెండర్లు పొందిన వారి నుంచి సమగ్ర శిక్ష ప్రాంతీయ కార్యాలయాలకు చేరుతున్నాయి.

బాలికలు, బాలురకు విడివిడిగా రూపొందించిన కిట్లను సెప్టెంబర్ ఐదో తేదీన పాఠశాలలు ప్రారంభమైన వెంటనే అందించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 శాతంపైగా కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లోని ఎంఆర్సీలకు చేరాయి. మొత్తం మీద ఈ కార్యక్రమాలన్నింటినీ ఒకే రోజున విజయవంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags