STUDENT
INFORMATION MANAGEMENT SYSTEM WEB PORTAL FOR
NEW ADMISSIONS
స్కూళ్ల అడ్మిషన్ల
వివరాల ఆన్‌లైన్ కోసం ప్రత్యేక పోర్టల్
ఈ విద్యాసంవత్సరం
నుంచే స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన రికార్డులను ఆన్‌లైన్‌లోనూ
నమోదు చేసి రిజిస్టర్ చేసేలా https://schooledu.ap.gov.in/SIMS20/ ప్రత్యేక
పోర్టల్‌ను విద్యాశాఖ రూపొందించింది. దీనిలో విద్యార్ధుల వివరాలను అప్‌లోడ్
చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ప్రవేశాల
ప్రక్రియకు సంబంధించి పలు సూచనలు
>కోవిడ్– 19
నివారణ సూచనలు పాటిస్తూ ప్రవేశాలు చేపట్టాలి.
>విద్యార్థులను
పాఠశాలకు రప్పించరాదు.
>2019–20లోని
ఆయా తరగతుల విద్యార్థులను తదుపరి క్లాస్‌లోకి ప్రమోట్ చేసి వారి పేర్లు పాఠశాల
అడ్మిషను రిజిష్టరులో నమోదు చేయాలి.
>ప్రాథమిక
పాఠశాలల్లో 5వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి చదివి
ఉత్తీర్ణులైన విద్యార్ధులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి
తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి.
>6వ
తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8వ తరగతిలో
ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.
>తల్లిదండ్రులు
తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చేందుకు వారి రికార్డు షీటు, బదిలీ
సర్టిఫికెటు అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు విధిగా అందించాలి.
>విద్యార్థులను
పాఠశాలలో చేర్చుకునేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు షీటు, బదిలీ
సర్టిఫికెట్ల విషయంలో నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి .
>ఒకవేళ
విద్యార్థి రికార్డు షీటు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే ఆ
తదుపరి కాలక్రమంలో వాటిని సమర్పించమనాలి.
>వలస వెళ్లిన
కుటుంబాల పిల్లలు, తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో
ఐడెంటిటీ నిరూపణ తప్ప మరే విధమైన ధ్రువపత్రాలూ అవసరం లేదు.
>ప్రవేశాలు
పూర్తి కాగానే ఎప్పటికప్పుడు నిర్దేశించిన చైల్డ్ ఇన్ఫో పోర్టల్‌లో నమోదు
చేస్తుండాలి.
> అన్ని
యాజమాన్యాల స్కూళ్లు ఈ మార్గదర్శకాలను పాటించాలి.
0 Komentar