ఫైనల్
ఎగ్జామ్స్ కి సిద్ధంకండి: యూజీసీ
విశ్వవిద్యాలయాల
చివరి సంవత్సరం పరీక్షల తేదీపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది ఉత్తర్వులు
జారీచేయలేదు. ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు10 కు వాయిదా వేసింది. అయితే యూనివర్సిటీలు
అన్నీ సెప్టెంబరు 30లోగా ఫైనల్ ఇయర్ పరీక్షలను పూర్తి చేయాలని యూజీసీ ఆదేశించింది.
పరీక్షలు ఆఫ్లైన్, ఆన్లైన్ లేదా రెండింటి మిశ్రమంగా ఉండవచ్చు. షెడ్యూల్ చేసిన
తేదీలో పరీక్షలు రాయని వారికి విశ్వవిద్యాలయాలు ప్రత్యేక పరీక్షలు
నిర్వహించనున్నట్లు యూజీసీ తెలిపింది.
అయితే కరోనా మహమ్మారితోపాటు అసోం, బీహార్ లో వరద పరిస్థితుల దృష్యా
చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ
క్రమంలో సుప్రీంకోర్టు శుక్రవారం ఎటువంటి ఉత్తర్వులు జారీచేయనందున ఆగస్టు 10న
తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు చివరి సంవత్సరం పరీక్షలను రద్దు
చేయకపోతే యూనివర్సిటీలకు, విద్యార్థులకుపరీక్షల తయారీకి ఒక
నెల మాత్రమే సమయం ఉంటుంది. దీంతో విద్యార్థులుపరీక్షలకు సన్నద్ధమవ్వాలని, సుప్రీంకోర్టులో విచారణ కారణంగా పరీక్షలు నిలిచిపోతాయనే అభిప్రాయంలో
విద్యార్థులు ఉండకూడదని యూజీసీ శుక్రవారం తెలిపింది.
corona kada all states cases akkuvaa ga vunnayi exams raddu cheste manchidi ani ankuntunna
ReplyDelete