ప్రభుత్వ
ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
జారీ
-ఉద్యోగులందరూ
హుందాగా, సంప్రదాయంగా
ఉండే దుస్తులను ధరించి విధులు నిర్వహించాలి
ప్రభుత్వ
ఉద్యోగుల వస్త్రధారణ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ మధ్యప్రదేశ్‌లోని శివరాజ్
సింగ్ చౌహన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను
ధరించి విధి నిర్వాహణకు రావాలని ఆదేశించారు. గ్వాలియర్ డివిజన్‌లోని ప్రభుత్వ
అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది.
వివరాలలోకి
వెళితే జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన
సమావేశానికి మాండ్‌సౌర్ జిల్లాలోని ఓ అధికారి పద్దతిగా లేని దుస్తులు (టీ షర్టు)
ధరించి హాజరయ్యాడు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరవ్వాలని
ఆదేశించారు. ఇయితే ఇప్పటికే అనేక రాష్ట్రాలు టీ షర్టు, జీన్స్
పై నిషేధం విధించాయి. గత ఏడాది బిహార్, తమిళనాడు
ప్రభుత్వాలు సైతం సచివాలయంలోని ఉద్యోగులు ఈ దుస్తులు ధరించరాదని ఉత్తర్వులు జారీ
చేశాయి.
0 Komentar